8 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌కి షాక్ ఇచ్చిన పాపుల‌ర్ సింగ‌ర్

ప్ర‌ముఖ సింగ‌ర్ అర్మాన్ మాలిక్ త‌న ఫాలోవ‌ర్స్‌కి పెద్ద షాకిచ్చాడు. మంగ‌ళవారం రోజు త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల‌న్నీ తొల‌గించాడు. ప్రొఫైల్ పిక్ కూడా మార్చి బ్లాక్ ఫోటోని పెట్టాడు. దీంతో ఆయ‌న‌ని ఫాలో అవుతున్న 8 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఒక్క‌సారిగా ఆందోళన చెందారు. పోస్ట్‌ల‌న్నీ డిలీట్ చేసిన త‌ర్వాత‌... దీనిని ఇంకా నేను స‌హించ‌లేను అని పోస్ట్ పెట్ట‌డంతో అర్మాన్‌కి ఏమైంద‌ని నెటిజ‌న్స్ ఆరాలు తీసారు. అయితే దీనిపై త‌న ట్విట్ట‌ర్‌లో చింతించాల్సిన అవ‌స‌రం ఏమి లేదు. కాల‌మే దీనికి స‌మాధానం చెబుతుంద‌ని ట్వీట్ చేశారు. అర్మాన్ ఇటీవ‌ల అల వైకుంఠ‌పురములో చిత్రంలో బుట్టబొమ్మ‌, బుట్ట‌బొమ్మ అనే సాంగ్ ఆల‌పించిన విష‌యం తెలిసిందే. ఈ సాంగ్‌కి దేశ వ్యాప్తంగానే కాదు ఇంట‌ర్నేష‌న‌ల్ పాపులారిటీ ల‌భించింది.