తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మకం-సారలమ్మ జాతర విజయవంతం అయిందని రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. గిరిజన వనదేవతల జాతర నేడు పూర్తైన నేపథ్యంలో మంత్రులు జాతర విజయవంతానికి సహకరించిన భక్తులు, అధికారులు, సిబ్బంది, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మేడారం జాతర విజయవంతంగా ముగిసినట్లు తెలిపేందుకు సంతోషిస్తున్నామన్నారు. అడుగడుగునా సలహాలు ఇస్తూ మార్గదర్శనం చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలన్నారు. జాతర విజయవంతంపై గవర్నర్లు, సీఎం సంతోషం వ్యక్తం చేశారన్నారు. కేంద్రమంత్రి అర్జున్ ముండా సైతం అమ్మవార్లను దర్శించుకుని సంతోషం వ్యక్తం చేశారన్నారు. సమన్వయంతో పనిచేసిన 21 శాఖల అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలన్నారు. ముఖ్యంగా గిరిజన సంక్షేమశాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా కు ప్రత్యేక ధన్యవాదాలన్నారు. గిరిజన బిడ్డగా మంత్రి హోదాలో గిరిజన జాతర చేసుకునే అవకాశం రావడం నిజంగా అదృష్టమన్నారు
మేడారం జాతర విజయవంతం: మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి